- Advertisement -
అప్పుల బాధ తాళలేక రైలు కింద పడి తనువు చాలించిన రైతు
Farmer who fell under the train because of debtతుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామానికి చెందిన జి.హనుమన్న (59) అనే రైతు సోమవారం రోజున రైలు కింద పడి తనువు చాలించాడు.వివరాలలోకి వెళ్ళగా హనుమన్న తన తన భార్య జమునమ్మ పేరు మీద గల 4.50 ఎకరాల పొలంతో పాటు,15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని తన జీవనం కొనసాగిస్తున్నారు.గత కొద్ది సంవత్సరాలుగా పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో సరైన దిగుబడి లేక పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో పూర్తిగా అప్పుల పాలయ్యాడు.పంట పొలాల సాగు కొరకు సుమారు 15లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు.ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో,అప్పులు తీర్చలేనని మనస్థాపం చెంది రైలు కింద పడి మృతి చెందాడు.చనిపోయిన హనుమన్నకు ఒక భార్య,ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు కలరు.సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని,పోస్టుమార్టం నిమిత్తం బాడీను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు మరియు గ్రామ రైతులు తెలియజేశారు.
- Advertisement -




