పడమర విప్పరులోకోతులు దాడులు
Attacks of Monkeys on west Vipparu
వణికి పోతున్న ప్రజలు
తాడేపల్లిగూడెం
కోతులు బెడదతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా సంచరిస్తూన్నాయి.గ్రామాల్లో తిష్ట వేసిహడలెత్తిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. ఇళ్లల్లో ఉన్న ఆహారపదార్ధాలు ఎత్తుకు పోవడంతో పాటు, వాటిని అడ్డుకూనేందుకు వచ్చిన గృహిణిలపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే ఈ రకంగా 50 మంది పై దాడి చేసి గాయాలు పాలు చేసిన ఘటనలు కనిపిస్తున్నాయి. గాయాలు పాలైన వారు తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్తున్నారు. అధికారికంగా ఏరియా ఆసుపత్రిలోని రికార్డులో కూడా చూపించారు. గతంలో పండు కోతులు పొలాల్లోను, ఇతర పంట పొలాలను పాడుచేస్తూ ఉండేవి. ఇప్పుడు పంట పొలాలు కనిపించడం లేదు చేపల చెరువులు ఎక్కువగా వెలిశాయి. దీంతో కోతులు ఇక గ్రామాలలో పడ్డాయి. గ్రామంలో ఉన్న చెట్లపై ఇల్లు పై తిరుగుతూ వండిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తూ,అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతులు పట్టించే కార్యక్రమాన్ని చేపట్టాలని పడమరవిప్పరు గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు



