- Advertisement -
ఏలేరు జలాశయం నుంచి నీరు విడుదల
Water release from Eleru reservoirప్రత్తిపాడు
ఏలేరు జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహం ఈ రాత్రికి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగిలి కోరారు. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24.11 టిఎంసిలు కాగా ప్రస్తుతం 23.23 టీఎంసీలు రిజర్వాయర్లో ఉందని, పై నుండి 46,405 క్యూసెక్కుల నీరు రాగా 25,275 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తద్వారా పల్లపు ప్రాంతాల లోకి నీరు ప్రవహించే అవకాశం ఉన్నందున ముందుగా ప్రజలు అప్రమత్తంగా ఉండి పునరావస కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు . ప్రజలకు ఏటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే సంబంధిత తాసిల్దార్ లకు సమాచారం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో సూచించారు.
- Advertisement -




