- Advertisement -
సెక్రెటరీ ని నిర్బంధించిన గ్రామస్తులు
Villagers arrested the secretaryభద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచుల పల్లి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ రంగుల రవి విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని ఆగ్రహించిన గ్రామస్తులు
సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి రూముకు తాళం వేశారు.రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తూ ఊరంతా జ్వరాల బారిన పడ్డారని, రోడ్లన్నీ బురదమయం అయితే కనీసం ఊర్లో బ్లీచింగ్ కూడా కొట్టించడం లేదని, గ్రామపంచాయతీ కార్యాలయం ముందే పెద్ద బురదగుంట ఉన్నాకుడా సెక్రెటరీ స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. విధులకు సైతం సరిగ్గా హాజరవడం లేదని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -




