వరద బాధితులను ఆదుకోవాలి

- Advertisement -

వరద బాధితులను ఆదుకోవాలి

Lets Help the flood victims

ఖమ్మం
తుఫాను మున్నేరు వరదల వలన నష్టపోయిన బాధితులని,రైతులని వెంటనే ఆదుకోవాలని ఖమ్మం కలెక్టరేట్ వద్ద వద్ద సి పి ఐ ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసి ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత పది రోజుల నుండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుఫాను వలన విస్తారంగా భారీ వర్షాలు కురవడంతో  వరదల మూలంగా మున్నేరు వరద ప్రవాహంతో ఖమ్మం నగరం అతలాకుతలం అయిందన్నారు. ఖమ్మం నగరంలోని రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, బొక్కలగడ్డ, సారధినగర్, మోతీనగర్, జలగంనగర్, ప్రకాష్ నగర్, దానవాయిగూడెం, రామన్నపేట, ధంసలాపురం, కవిరాజునగర్ తదితర ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి కొన్ని ఇండ్లు కొట్టుకుపోయయి. ఇండ్లలో విలువైన సామాన్లు, బట్టలు కొట్టుకుపోయయి.జిల్లాలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పంటలు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసర తదితర పంటలు దెబ్బతిన్నాయి. పశువులు, మేకలు,  కోళ్లు, చేపలు సైతం కొట్టుకొని పోయి చనిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాల బాధితులను వెంటనే సమగ్రమైన సర్వేలు నిర్వహించి ఆదుకోవాలని కోరారు.తుపాను వరదలలో కొట్టుకొని పోయి చనిపోయిన వారికి 25 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలనీ డిమాండ్ చేశారు.ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాలలో నష్టపోయిన ప్రజలకు ఆస్తినష్టం అంచనావేసి పరిహారం అందించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పెసరతోపాటు దెబ్బతిన్న అన్ని పంటలకు సర్వే చేసి నష్టపరిహారం అందించాలన్నారు.ఆహార పంటలకు 25000, వాణిజ్య పంటలకు 50,000 నష్టపరిహారంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే ఇండ్లు మంజూరు చేసి కట్టించాలనీ కోరారు.జిల్లా వ్యాప్తంగా పశువులు, మేకలు, కోళ్లు, చేపలు తదితర చనిపోయిన జంతు నష్టాలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలనీ డిమాండ్ చేశారు. అనంతరం వినతులతో కూడిన పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular