వరద బాధితుల సహాయాన్ని లక్షకు పెంచాలి

- Advertisement -

వరద బాధితుల సహాయాన్ని లక్షకు పెంచాలి

Assistance to flood victims should be increased to one lakh

ముంపు ప్రాంతంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించాలి
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్   డిమాండ్
ఖమ్మం
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం నాడు మున్నేరు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులతో ఓదార్పు చేశారు ఈ ప్రతినిధి బృందం తొలిత మంచి కంటి నగర్ బొక్కలగడ్డ వెంకటేశ్వర్ నగర్ అనంతరం రాజీవ్ స్వగృహ ఏరియాలోని ముంపుగురైన ఇళ్లను దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి సర్వం కోల్పోయిన ముంపు బాధితులతో పలకరిస్తూ వారి బాధలను స్టడీ చేశారు ఈ సందర్భంగా *సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రంగయ్య జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు ప్రగతిశీల ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి  వి ప్రభాకర్ లు మాట్లాడుతూ వరద ప్రభావాన్ని ముందే అంచనా ఏసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం తొలిత విఫలమైందని వరదలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దీని కారణంగా ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లిందని వారు అన్నారు పేద మధ్యతరగతి ఇండ్లు నీరు పట్టడం కారణంగా రెండు నుంచి ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వారు తెలియజేశారు లక్షలాది రూపాయలు నష్టపోతే కేవలం 16,500 ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు . ఖమ్మం జిల్లాలో  వరద కారణంగా 20 వేల ఇళ్లకు పైగా వరదలో చిక్కుకున్నాయని ఇంటికి లక్ష రూపాయల చొప్పున బాధితులకు అందజేయాలని అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున అందించే వారిని ఆదుకోవాలని వారు డిమాండ్. చేశారు ప్రతి సంవత్సరం వరదలతో కోట్లాది రూపాయల ప్రజల ఆస్తి నీళ్ల పాలు అవుతుంటే  ముందస్తు ప్రణాళిక ప్రకారం వరద ముప్పు ఖమ్మానికి పట్టకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు వరద ప్రాంతాల్లో ఉన్న పేదలను ఖాళీ చేయించి వారందరికీ 150 గజాలలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు వరద కారణంగా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని 25 లక్షల కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఖమ్మం వరద పై ఇంతవరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు .

ఈ ప్రతినిధి బృందంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిన్న చంద్రన్న ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పుల్లయ్య ఆవుల అశోక్ ఝాన్సీ శోభ మంగతాయి సురేష్ కే శ్రీను భరత్ సత్తార్ ధరణి కృష్ణ వెంకటేష్ లక్ష్మణ్ రవీందర్ శారద జాస్మిన్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నార.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular