వికలాంగులకు స్వయం ఉపాధి శిక్షణ మరియు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి

- Advertisement -

వికలాంగులకు స్వయం ఉపాధి శిక్షణ మరియు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి

Self-employment training & employment centers should be established for disabled

గోపవరం ఎంపీడీవో సి రామకృష్ణయ్య వినతి
బద్వేలు
ఈ సందర్భంగా ఇండ్ల ఓబులేసు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ మరియు గోపవరం మండలం లో వికలాంగుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది నిరుద్యోగులైన దివ్యాంగులు దివ్యాంగుల మహిళలు ఇంటికే పరిమితమై కుటుంబాలు పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమాజంలో బయట వికలాంగులు మీరు ఏమీ పని చేయలేరని చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా వారిని దగ్గరకు తీసుకొని ఉపాధి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది వికలాంగ మహిళలు వారు కుటుంబానికి భారంగా వారి పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఉత్పత్తులు తయారుచేసి ఆ ఉత్పత్తుల ద్వారా వారికి నెలకు కనీసం 20 వెలు రూపాయలు ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ సందర్భంగా గోపవరం మండలంలో ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడ ఉపాధి శిక్షణ కేంద్రాలు  ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా వికలాంగులను ఆర్థికంగా ఆదుకోవాలని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులైన వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఉపాధి లేక కుటుంబంలో భారంగా ఉంటున్నటువంటి వారిని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు.. చిన్నచిన్న వ్యాపారాలకు ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి ముందుకు రావాలని వ్యాపారాలకు సహకరించాలని ఉత్పత్తులను తయారు చేసే దానికి వారికి అన్ని విధాలుగా సహకరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గారు స్పందిస్తూ ప్రభుత్వానికి పై అధికారులకు సమాచారాన్ని అందించి వికలాంగులకు అన్ని విధాలుగా సహకరిస్తామని అందుకు ప్రణాళికలు సంబంధించిన నివేదికలు మాకు ఇచ్చినట్లయితే త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వికలాంగులను ఆదుకోవటం ప్రభుత్వమైన మాకు బాధ్యత ఉంది అని బాధ్యతను గుర్తు చేశారు అందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ సమస్యలను తొరగాతిగా పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో s. హసీనా, దివ్యాంగుల చైతన్య సమితి కన్వీనర్ ఎడ్లపాటి నాగమణి, గౌరవ ఆహ్వానితులు వల్లూరు అనురాధ, పట్టణ అధ్యక్షులు చింతకుంట రఫీ ఏరియా అధ్యక్షులు బాలరాజు, నిరుద్యోగ విభాగం సభ్యులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular