- Advertisement -
హేమ డ్రగ్స్ తీసుకుంది… తేల్చి చెప్పిన పోలీసులు
Hema took drugs... the police confirmed
బెంగళూరు, సెప్టెంబర్ 12, (న్యూస్ పల్స్)
బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీపై దాడి చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ( సీసీబీ ) అధికారులు సోమవారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నటి హేమ సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారన్న ఆరోపణలతో.. ఈ రేవ్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. వాసు అనే వ్యక్తి బర్త్ డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశాడు.కేసు దర్యాప్తును పోలీస్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ లీడ్ చేశారు. తాజాగా ఆయన 1,086 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ ఎండీఎంఏ సేవించిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్ష ఫలితాలను జతపరిచారు. పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా.. డ్రగ్స్ నెగెటివ్ వచ్చిందని.. ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలో పట్టుబడిని తర్వాత హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని.. హైదరాబాద్‌లో ఉన్నట్లు వీడియో విడదుల చేసింది. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. అయితే ఆమె మెడికల్ రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆపై ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమ… వాసు, అరుణ్‌లకు ఫ్రెండ్. వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు.చార్జిషీట్‌లో మొత్తం 88 మందిని నిందితులుగా గుర్తించారు. వాసు, అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు, కోరమంగళకు చెందిన అరుణ్ కుమార్, నాగబాబు, మహ్మద్ అబూబకర్, అగస్టిన్ దాదాగా గుర్తింపు పొందిన నైజీరియన్ దేశస్థుడ్ని పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు, డ్రగ్స్ సప్లై చేసినందుకు నిందితులుగా చేర్చారు.హేమతో సహా మిగిలిన 79 మంది నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం సెక్షన్ 27 (బి) – (ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్ధం సేవించినందుకు శిక్ష) కింద బుక్ చేశారు. సెక్షన్ ప్రకారం, నిందితులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా శిధిస్తారు. లేదా కోర్టు విచక్షణ మేరకు జైలు శిక్షతో పాటు ఫైన్ ఫైన్ రెండూ వేయవచ్చు. నిందితుల కాల్ డిటైల్స్ రికార్డు (సీడీఆర్)ను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. స్పాట్‌లో ఎండిఎంయే మాత్రలు, ఎండిఎంయే క్రిస్టల్, ఆరు గ్రాముల హైడ్రో గంజాయి, ఐదు గ్రాముల కొకైన్, కొకైన్ పూతతో కూడిన 500 రూపాయల నోటు, 6 కిలోల హైడ్రో గంజా, 5 మొబైల్ ఫోన్లు, వోక్స్‌వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు వంటివి సీజ్ చేసినట్లు.. చార్జ్‌షీట్‌లో చూపించారు.
- Advertisement -