Sunday, April 26, 2026

హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు

- Advertisement -

హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు

Hyderabad is being destroyed

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్
పోలీసులు ఎమ్మెల్యేల ఇండ్లచుట్టూ ఉండి హౌస్ అరెస్టు చేయడం మంచిది కాదు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ ను నాశనం చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరెట్ ఏర్పడిన నాటి నుండి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగలేదు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీ కోసం వెళ్తే ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కరెక్టేనా. సీపీ కార్యాలయంకు వెళ్లినందుకు పోలీసులు అరెస్టు చేసి  180 కిలోమీటర్లు తిప్పారు. ఇలాంటి అలజడులు సృషిస్తే ప్రజలు చూస్తే ఊరుకోరు. తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాం ఆంధ్ర తెలంగాణ అని ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. హైడ్రా పేరుతో ఒకవైపు పేద ప్రజల ఇండ్లను కూల్చడం భయపెట్టడం మరోవైపు ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులు చేయడం ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. వినాయక చవితి సమయంలో ఎలాంటి అల్లార్లకు తావులేకుండా  పోలీసులు చూసుకోవాలని అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంత వాతావరణం ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి విధంగా చూడాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్