ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రెషర్ డే కార్యక్రమం

- Advertisement -

ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రెషర్ డే కార్యక్రమం

Freshers Day program at Government Degree College, Allagadda

ఆళ్లగడ్డ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ద్వితీయ సంవత్సరం మరియు తృతీయ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులు  మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధ్యక్షులు డాక్టర్ శివరామయ్య ప్రిన్సిపల్  మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు  అధ్యాపకులతో గౌరవంగా మసులుకొని చదువు పరంగా ఎటువంటి  అనుమానాలు ఉన్న వారితో సంప్రదించి సక్రమంగా చదువుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని
సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రోటరీ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ  తను కూడా ఒకప్పుడు ఇదే కళాశాలలో విద్యను అభ్యసించానని,తాను ఈ కళాశాలకు పూర్వ విద్యార్థిననే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా  ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని దానికోసం కష్టపడి చదవాలన్నారు. తాను విద్యను అభ్యసించిన ఈ కళాశాల కోసం కళాశాల అభివృద్ధి కోసం  తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి గంగన్న మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదవాలని కళాశాలలో జరిగే అన్ని కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఫ్రెషర్స్  డే సందర్భంగా పాటలు డ్యాన్స్లతో విద్యార్థులు ఎంతో సంబరంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు సంధ్యారాణి, నాగ మస్తాన్, డాక్టర్ ఎస్ రాజు, డాక్టర్ జయ చంద్రుడు, డాక్టర్ వెంకట సుబ్బయ్య, వెంకటేశు,  కుమార్, స్వరూప, కాశీ విశ్వనాధ్, హుస్సేనయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం   తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular