- Advertisement -
సొసైటీ లో బయటపడ్డ ఏరియేటర్స్ కుంభకోణం
The aerators scandal in the societyముమ్మిడివరం
ఐ.పోలవరం మండలం కోమరగిరి సొసైటీ లో ఏరియేటర్స్ కుంభకోణం బయటపడింది. ఏరియేటర్స్ కొనుగోలు లో సొసైటీ అధ్యక్షుడు,సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడారని మాజీ సొసైటీ అధ్యక్షుడు
కలిదిండి సీతారామరాజు డిసిసిబి సీఈఓ కు పిర్యాదు చేసారు. పిర్యాదు పై ముమ్మిడివరం సహకార సంఘ అసిస్టెంట్ రిజిస్టార్ వెంకట నారాయణ విచారణ నిర్వహించారు. గత కొద్దికాలంగా సహకార సంఘం ద్వారా
ఏరియేటర్స్ కొనుగోలు చేసి సొసైటీ ఆక్వా రైతులకు అద్దెకిస్తుంది. ఏరియేటర్స్ కొనుగోలులో సొసైటీ అధికారులు, అధ్యక్షుడు నాసిరకం ఏరియేటర్స్ తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ రేటు కు కొనుగోలు చేసినట్లు
తప్పుడు బిల్లులు సృష్టించారని రైతుల ఆరోపణలు. కుంభకోణంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని సొమ్ము స్వాహా చేసిన వారి నుండి సొమ్ము రికవరీ చేయాలని లేకపోతే రైతులు ఆందోళన కు దిగుతామని
హెచ్చరించారు..
- Advertisement -




