- Advertisement -
శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ నెల కోటా ఆన్లైన్ టికెట్లు విడుదల
Srivari Arjita Seva December month quota online tickets releaseతిరుమల సెప్టెంబర్ 18
;తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటా ఆన్లైన్ టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.ఇక, ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మధ్యామ్నం 3 గంటలకు వసతి కోటా విడుదల చేయనున్నారు.
- Advertisement -




