భర్తను కత్తెరతో పొడిచి

- Advertisement -

భర్తను కత్తెరతో పొడిచి

She stabbed her husband with scissors

కాకినాడ, సెప్టెంబర్ 18, (వాయిస్ టుడే)
భార్యాభర్తల మధ్య వివాదంతో.. ఓ భార్య తన భర్తను దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో  జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం  మండలంలోని రెడ్డిచెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు, రాణి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా వీరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన రాణి తన భర్త గుండెలపై కత్తెరతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును అతని సోదరుడు తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని.. పూర్థిస్థాయిలో విచారిస్తున్నామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular