హలియాలో గురు పూజోత్సవం
Guru Pujotsavam in Haliya
నల్లగొండ
హలియ లక్ష్మి నరసింహ గార్డెన్ లో నాగార్జున సాగర్ నియోజక వర్గ స్థాయి గురుపూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయలకు అవార్డు పురస్కారమునకు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః అంటే గురువు విష్ణు,బ్రహ్మ,శివునితో సమానం అన్నారు.. పారిశ్రామిక రంగాల వారు ఉత్పత్తి నాణ్యతను సృష్టిస్తారు…కానీ జ్ఞానాన్ని అందించేది గురువులే అని కొనియాడారు..ప్రాథమిక పాఠశాలకు 5000 ఉన్న గ్రాంటులను 10000 పెంచింది కాంగ్రెస్ అన్నారు.. గతప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పాఠశాల లకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ పాఠశాల లకు పంపిస్తే అందరికీ నమ్మకం కలుగుతుందన్నారు.



