చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి
Handloom products should be promoted
హైదరాబాద్
చేనేతకారుల ఉత్పత్తులను ప్రతిఒక్కరూ ధరించి ప్రోత్సహించాలని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, సుధాజైన్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హంస ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో ది లైవ్ హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో పేరిట చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డాక్టర్ ప్రీతిరెడ్డి, సుధాజైన్ హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. చీరలను తిలకించి చేనేతకారులను అభినందించారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులైన సిల్క్, కాటన్, డిజైనరీ వస్త్రాలను సుమారు 70స్టాల్స్ ఏర్పాటు చేశామని నిర్వాహకు రాలు శైలజా యముసామి తెలిపారు. ఈ నెల 26 వరకూ ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు.