- Advertisement -
పోలీసు కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించిన కమిషనర్
The Commissioner visited the Police Convention Centre
సిద్దిపేట
పోలీస్ కన్వెన్షన్ సెంటర్, వెల్ఫేర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కన్వెన్షన్ పరిసర ప్రాంతాలను మరియు పోలీస్ కన్వెన్షన్ ఆవరణలో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెల్ఫేర్ ఆఫీస్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
కమిషనర్ మాట్లాడుతూ కన్వెన్షన్ సెంటర్ మరియు చుట్టూ పరిసర ప్రాంతాలను ఎప్పుడు ఆహ్లాదకరంగా పచ్చదనం పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు. వెల్ఫేర్ ఆఫీసులో ఉన్న రికార్డ్స్ ఏరోజుకారోజు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పోలీసుల వెల్ఫేర్ గురించి సబ్సిడరీ క్యాంటీన్ ద్వారా నిత్యవసర సరుకులు మార్కెట్ కంటే చాలా తక్కువ రేటులో అందించడం జరుగుతుందన్నారు. మరియు పోలీస్ కన్వెన్షన్ హాల్ పోలీస్ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ ఏదైనా మెంటెనెన్స్ చార్జీ తీసుకొని ఫంక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉన్నదని తెలిపారు. రాబోవు రోజులలో సిబ్బంది పోలీస్ అధికారుల సంక్షేమం గురించి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విష్ణు ప్రసాద్, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -