Thursday, February 26, 2026

మంత్రివర్య మా రైతుల గోడు వినండి…..

- Advertisement -

మంత్రివర్య మా రైతుల గోడు వినండి…..

Minister listen to our farmers.....

మా రోడ్డుకు నిధులు కేటాయించండి. ….

ఈ దారి గుండా నడవలేకపోతున్నాం. ….

ఎరువులు నెత్తి పైన పెట్టుకొని పోవాల్సి వస్తోంది. …

కమాన్ పూర్
మంత్రివర్య మా రోడ్డును చూడండి…
వర్షాకాలంలో నడవలేకపోతున్నాం… రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాస్త దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రోడ్డు పూర్తిగా బురద మయంగా మారుతుందని నడవలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే కమాన్ పూర్ మండలం శివారులోని రహమతుల్లా మోరి నుండి చౌట వాగు ద్వారా స్వర్ణ కుంట కు వెళ్లాలంటే రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ఈ రోడ్డుకు తాత్కాలిక రోడ్డు వేసి చౌటవాగుపై రోడ్డాం వేశారు. భారీ వరదల వల్ల రోడ్డు కాస్త తెగి పోయింది. అలాగే  మట్టి రోడ్డు తాత్కాలికంగా వేశారు భారీ వర్షాలతో పూర్తిగా బురదమయంగా మారి వెళ్లలేని దుస్థితి నెలకొంది.. రైతులు నెత్తిపైనే క్వింటాలు వరకు ఎరువులు మోసపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ దారి గుండా సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. రాజాపూర్ మరియు లంక కేసారం కల్వచర్ల గ్రామాల రైతులకు ఈ రోడ్డు. పూర్తయితే సౌకర్యంగా మారుతుందని రైతులు మంత్రి శ్రీధర్ బాబును కోరుచున్నారు. వెంటనే ఈ రోడ్డుకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించి రైతులను ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబును రాజాపూర్ లొంక కేసారం కల్వచర్ల శివారు రైతులు కోరుతున్నారు..

పొలాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది.
మాడిశెట్టి రవి. … రైతు కిష్టం పల్లె
తమ పంట పొలాలకు వెళ్లాలంటే సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న పొలం కు కల్వచర్ల లొంతకేసారం నుండి తిరిగి రావడంతో ఆలస్యం జరుగుతోందని అలాగే వర్షాకాలంలో బురదమయంగా మారి వెళ్లలేని పరిస్థితి నెలకొంది అని మాడిశెట్టి రవి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని వెంటనే నిధులు కేటాయించాలని కోరారు.

మంత్రి వర్ర్యా ఆదుకోండి మాకు దారి చూపండి..
కార్పాకుల రాజయ్య రైతు రాజాపూర్.

మాకు రహమతుల్లా మోరి నుండి వయా చౌట వాగు ద్వారా  పూర్తిస్థాయిన రోడ్డు వేసి ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు గారు మొర ఆలకించండి రోడ్డు వేసి రైతులను ఆదుకోండి అని కార్పగల రాజయ్య కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్