దేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలి

- Advertisement -

దేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలి

The number of ration cards in the country should be reduced

ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలి
దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలి
ఈటల రాజేందర్, ఎంపీ
హైదరాబాద్
పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. . విద్యానగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈటల మాట్లాడుతూ ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలి.  ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలి.  దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలని అన్నారు.
ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారు.  తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు.  భారతదేశం యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుంది.  ప్రోత్సాహకాలు అందిస్తుంది.  నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం. స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడమని అన్నారు. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలి.  పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయి.  నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలి. దీనికోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడ్డాను.  వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు చేసేవారు.  చేతి వృత్తుల వారు జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళు. వారికి ఏం ఇచ్చినా తక్కువే.  చేతి వృత్తుల వారి పట్ల మన మైండ్ సెట్ మారాలి. వారిపట్ల చిన్న చూపు తగదు. ఆపదలో ఉన్నవాడికి అవసరం ఉన్నవాడికి సాయం చేసేవాడే నిజమైన మనిషి.  77 సంవత్సరాల తరువాత కూడా ఈ దేశంలో పేదరికం ఉంది, ఆకలి ఉందనే ప్రధాని నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మలాంటి స్కీంలు తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular