Monday, January 26, 2026

సీఎం రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం..

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం..

Council of Ministers meeting presided over by CM Revanth Reddy..

పలు కీలక నిర్ణయాలు
హైదరాబాద్
మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ  పేరును.. తెలుగు విశ్వవిద్యాలయానికి  సురవరం ప్రతాపరెడ్డి పేరును, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ, పేరును మంత్రిమండలి నిర్ణయించింది.
హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడం.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఓ ఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా, పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది.
కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం.
కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం.
హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి.
ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్.
రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు.
ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీ ఎఫ్‌కు కూడా వర్తింపజేయడం.
తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయింపు.
ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయింపు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు.
రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు
ఎస్‌ ఎల్‌ బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చడం.
కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్