ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక? 

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక? 

Selection of beneficiaries for Indiramma houses from October 15?

హైదరాబాద్:సెప్టెంబర్ 24 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక నిర్ణయం తీసుకు న్నారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వారం రోజుల్లో విధి విధానాలు రూపొంది స్తామని రాష్ట్ర గ్రుహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మహబూబా బాద్, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి సోమ వారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ అభివ్రుద్ధి సమీక్షా సమావేశంలో అర్హుల కోసం డబుల్ బెడ్ రూమ్స్ గదుల ఇళ్ల పంపిణీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.దీంతోపాటుగా అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. సొంతగా స్థలం ఉండి ఇండ్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంతగా స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కింద రూ. 5లక్షలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular