- Advertisement -
ఏ ఆర్ కానిస్టేబుల్ తన వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్య
AR constable committed suicide by shooting himself with his weaponరంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున ఏ ఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్(28) తన పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున బాత్రూం గదిలోకి వెళ్లి తలుపులు మూసివేసి, తన సొంత ఆయుధంతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జవాను మృతదేహాన్ని ఆదిభట్ల పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు మృతుడితోపాటు సహ ఉద్యోగులు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మృతుడు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మంచాల మండల కేంద్రం. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న బాలకృష్ణ, ఆన్లైన్ గేమ్స్ బానిసైనట్లు సమాచారం.
- Advertisement -




