- Advertisement -
ఏపీలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గించిన కూటమి ప్రభుత్వం : పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
prices of sugarcane &sugar reduced in AP: Civil Supplies Minister Nadendla Manohar
విజయవాడ
రాష్ట్రంలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు,. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న వేళ ప్రభుత్వ కీలక నిర్ణయం అమల్లోకి వచ్చిందని అన్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.180 (కేజీ) అమ్ముతున్న కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి ఇప్పటికే 160 రూపాయలు, 150 రూపాయలకు తగ్గించామని అన్నారు.
ఇపుడు తాజాగా రూ.67కే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు.
దీని ద్వారా నాలుగు కోట్ల 32 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మంగళవారనం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర పంపిణీ చేస్తారు.
- Advertisement -