చలో కలెక్టరేట్ కు పిలుపు

- Advertisement -

చలో కలెక్టరేట్ కు పిలుపు

A call to the Chalo Collectorate

మెట్పల్లి అక్టోబర్ 2

అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్  ముట్టడికి తరలి రావాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు నాయకులు పిలుపునిచ్చారు
మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి,రాజేశ్వరరావు పేట,సత్తక్కపల్లి, సంస్థాన్ బండలింగాపూర్, జగ్గసాగర్, ఆత్మకూర్,కొండ్రికర్ల,మెట్ల చిట్టాపూర్, కొనరావుపేట్,చౌలమద్ది,పెద్దాపూర్, గ్రామంలో రైతులతో సమావేశం లో జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు  మాట్లాడుతూ అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని,ఎకరాకి 15000 రైతు భరోసా,అలాగే వరికి క్వింటాల్  కి 500 బోనస్  ప్రకటించాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమానికి  జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి,రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి,మిట్టపల్లి తిరుపతిరెడ్డి,నోముల నరసింహా రెడ్డి,పిడుగు సందయ్య,బందెల మల్లయ్య,సోమిరెడ్డి బుచ్చిరెడ్డి, కుంట చిన్నారెడ్డి,యాల్ల తిరుపతిరెడ్డి,గడ్డం రాజారెడ్డి,మారు జనార్దన్ రెడ్డి,రైతు సంఘం ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular