- Advertisement -
*తిరుమలలో నేడు ధ్వజారోహణం*
*పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు*
Flag hoisting today in Tirumala
తిరుమల :
ఏపీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం తిరుమలలో
ధ్వజారోహణం నిర్వహించడంతో శాస్త్రోక్తంగా ప్రారంభం అవుతాయి.
శ్రీదేవి,భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి సమక్షంలో అర్చక స్వాములు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేసి సకల
దేవతలను,అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు.
నేటి రాత్రి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారి పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.
- Advertisement -


