పెదవేగి మండలంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన
MP Putta Mahesh Kumar visited Pedavegi mandal along with MLA Chintamaneniఏలూరు: అక్టోబరు 05
పరిశోధనా ఫలాలు రైతులకు అందినప్పుడే ప్రభుత్వలక్ష్యం నెరవేరుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం ఎం.ఆర్.సి కాలనీలోని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ను శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సందర్శించారు.
రీసెర్చ్ సెంటర్ లోని సమావేశ మందిరంలో శాస్త్రవేత్తలతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసెర్చ్ సెంటర్ ద్వారా చేపట్టిన ప్రయోగాలను శాస్త్రవేత్తలు వివరించారు. అన్నదాతలకు ప్రయోజనాలు కలిగించే ప్రతిపాదనలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావటం లేదని తాను ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినప్పుడు చెప్పారని ఎంపీ శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని రీసెర్చ్ సెంటర్ దృష్టిలో పెట్టుకొని రైతన్నలకు మేలు జరిగే ఏ అంశమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎంపీ సూచించారు. ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులకు తాను అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా కోకో రైతులకు సంబంధించి సమస్యను మొట్టమొదటిసారి తానే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు వెల్లడించారు..




