- Advertisement -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి
Prepare for grain purchases
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి,
ధాన్యం దిగుబడి అంచనా మేరకు కొనుగోళ్లకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార పరిశ్రమలు, డిఆర్డీఏ శాఖల అధికారులతో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, కొనుగోలు కేంద్రాలల్లో సౌకర్యాలు కల్పన, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 105650 ఎకరాల్లో వరి సాగు జరిగిందని దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా మేరకు 300 కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరి కోతలు ప్రారంభాన్ని బట్టి కోనుగోలు చేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ఏడాది వానాకాలం సీజన్ లో రైతులు సాగు చేసిన వరి ధాన్యం చేతికి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కొనుగోళ్లపై అధికారులు సన్నదంగా ఉండాలని తెలిపారు. ఇందుకోసం అవసర మైన గన్నీసంచులు, ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు
టార్పా లిన్లు, తేమ నిర్ధారణ యంత్రాలకు ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ డిఎం ను ఆదేశించారు. గత సంవత్సరం ఏ ఏ కేంద్రాల్లో దాన్యం ఎక్కువగా వచ్చిందో అంచనా ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లకు ముందుగానే శిక్షణా తరగతులు నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించినందున సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు విడివిడిగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రత్యేకంగా నంబర్లు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల సంస్థ డిఎం రాములు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ డిఎం కనక శేఖర్, పరిశ్రమల శాఖ జిఎం సిద్ధార్థ రెడ్డి, డిఆర్డిఎ డిపిఎం రవి, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


