Wednesday, March 25, 2026

హత్య కేసులో ఐదుగురు అరెస్టు ఏ1 పరారీ

- Advertisement -

హత్య కేసులో ఐదుగురు అరెస్టు ఏ1 పరారీ

Five arrested in murder case A1 is absconding

మేడ్చల్
ఈ నెల 4 వ తేదీన  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ ప్రాంతంలో జరిగిన  వెంకటప్పయ్య రెడ్డి హత్య కేసు ను జగద్గురి గుట్ట పోలీసులు చేధించారు.  ఐదు మంది నిందితులు అరెస్టు చేసాం.  ఒకరు పరారీ లో వున్నారని బాలానగర్ డీపీసీ కోటిరెడ్డి వెల్లడించారు. నిందితులనుంచి ఒక  బంగారు రింగు, ఐదు మొబైల్ ఫోన్లు,,ఒక జ్యూపిటర్ స్కూటీ మరియు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కోయ వెంకటప్పన్న రెడ్డి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు. నిందితుల ఏ2 బసిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఏ3- పాశం ప్రసాద్, ఏ4. బుసుపాటి కిరణ్, ఏ5. గడ్డం వెంకటేష్, ఏ . అన్నిక మణి కంఠ లను రిమాండ్ కు తరలించారు. ఏ 1. బత్తిన ద్వారకనాధ్ రెడ్డి  పరారీ లో వున్నట్లు డీపీసీ  వెల్లడించారు.
మృతుడు కాకినాడ షిప్ యార్డ్ లో గతంలో బిజినెస్ చేసాడు.. ద్వారక నాథ్ రెడ్డి అనే వ్యక్తి తో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది.. బిజినెస్ ఆర్థిక లావాదేవీలలో భాగంగా ద్వారాకనాథ్ రెడ్డి 28 లక్షలు ఇవ్వాలి అని డీల్ కుదుర్చుకున్నారు.. ఈ నెల 6వతేది డబ్బులు ఇవ్వాల్సి ఉంది.. కానీ ఇవ్వకుండా , ద్వారకానాథ్ రెడ్డి కనిపించకుండా తిరుగుతున్నాడు. వెంకతప్పన్న రెడ్డి ద్వారాకరెడ్డి ఇంటికి వెళ్లి కూడా డబ్బులు విషయంలో మాట్లాడాడు.. డబ్బులు ఇవ్వకుండా ఉండాలని భావించిన ద్వారాకరెడ్డి ఐదు మంది  వ్యక్తులను కిడ్నాప్ చేయడానికి మాట్లాడుకున్నాడు.. ఐదుగురు నిందితులు కడప జిల్లా వాసులు. పక్క రెక్కీ నిర్వహించి కిడ్నప్ చేయాలని స్కెచ్ వేశారు. వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడగించి మత్తు ఇచ్చి బీచ్ పల్లి వద్ద కృష్ణ నదిలో పడేసారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో మృతదేహం గుర్తించాం. 100 సీసీ కెమెరాలు, ఇతర టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేసామని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్