Monday, February 16, 2026

మళ్లీ టీఆర్ఎస్సేనా…

- Advertisement -

మళ్లీ టీఆర్ఎస్సేనా…

TRS again...

హైదరాబాద్, అక్టోబరు 11, (వాయిస్ టుడే)
తెలంగాణ సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ పేరు మార్చగానే ఓటమిపాలైందనే టాక్ రాష్ట్రమంతా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి వరకు పార్టీ ప్రయాణం గమనిస్తే అదే అర్థమవుతుంది. పేరు మార్చిన తర్వాతే డౌన్ ఫాల్ మొదలైందని కార్యకర్తలు అందరూ చర్చించుకున్నారు. అదే విషయాన్ని బయటకి ఒప్పుకోకపోయినా అధిష్టానం కూడా దాదాపుగా ఏకీభవించింది.తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ మళ్లీ పార్టీ పేరును టిఆర్ఎస్‌గా మారుస్తారన్న చర్చకు దారితీసింది. ఇటీవల వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను  ఉద్దేశించి 2029లో ప్రాంతీయ పార్టీలదే దేశవ్యాప్త హవా అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలది హవా అంటూ వ్యాఖ్యానించడం పైన కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు.మరోవైపు కార్యకర్తల్లో కచ్చితంగా పేరు మార్పు జరుగుతుందంటూ కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. నిజానికి టెక్నికల్ గా చూస్తే పేరు మార్పు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గతంలో టీవీ9 స్టూడియోలో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ కూడా చెప్పారు. ఒకసారి రాజకీయ పార్టీ పార్టీ పేరు మారాక ఆరు సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ఆరేళ్లలో మళ్లీ పేరు మార్చడానికి వీలు లేదు. ఇది ఎన్నికల కమిషన్ నిబంధన.ఒకవేళ ఆరేళ్ల తర్వాత పేరు మార్చుదామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికి వేరే వ్యక్తులు రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఆ పేరు దక్కడం కష్టమే. సో మంచైనా చెడైనా భారత రాష్ట్ర సమితి పేరుతోనే రాజకీయాలు నిర్వహించాలి. కాకపోతే గతంలోలా ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తాం… జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామంటూ భావించిన బిఆర్ఎస్ అధిష్టానం ఇక పూర్తిస్థాయిలో తెలంగాణలోనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీ పేరు మారినా.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రాంతీయ పార్టీగానే పరిమితమైంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉండేది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్