Sunday, January 25, 2026

డిల్లీలో రద్దీ ట్యాక్స్…

- Advertisement -

డిల్లీలో రద్దీ ట్యాక్స్…

Congestion Tax in Delhi

న్యూఢిల్లీ, అక్టోబరు 14, (వాయిస్ టుడే)
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ప్రజలు చాలా కాలంగా రద్దీ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పరిష్కారం దక్కలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ‘ట్యాక్స్’ ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ‘దిల్లీ కంజెషన్ ట్యాక్స్’ ప్రకారం.. రద్దీ సమయంలో, ఎంపిక చేసిన రోడ్డు మీద మీరు ప్రయాణిస్తే అదనంగా- కొత్త ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది! ఇలా చేస్తే, ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.రద్దీ సమయాల్లో నిర్దేశిత రహదారులను ఉపయోగించినందుకు డ్రైవర్లకు ఛార్జీలు వసూలు చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నామని రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ షహజాద్ ఆలం తెలిపారు.రవాణా నిర్వహణకు కొత్త నిధుల కేటాయింపు జరుగుతోంది. మేము పనిచేస్తున్నదాన్ని ‘రద్దీ ధర(కంజెషన్ ప్రైజింగ్)’ అని పిలుస్తున్నాము,” అని ఆలం చెప్పారు.ఇందుకోసం ప్రయోగాత్మకంగా దిల్లీ సరిహద్దుల్లోని 13 కీలక ప్రాంతాలను గుర్తించి పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టారు.దిల్లీలో సదరు “రద్దీ పన్ను” ప్రతిపాదన కొత్త విషయం కాదు. 2018లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్లపైకి ప్రవేశించే వాహనాలకు ఛార్జ్ వసూలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.ట్రాఫిక్ని సులభతరం చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. నాడు.. ప్రభుత్వం నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని కోరుతామని బైజల్ పేర్కొన్నారు. ఐటీఓ కూడలి, మెహ్రౌలి-గుర్గావ్ రోడ్డు సహా 21 హై ట్రాఫిక్ ప్రాంతాలను పన్నుకు అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఆ సమయంలో దిల్లీ ప్రభుత్వం గుర్తించింది.2017లో పార్లమెంటరీ కమిటీ కూడా రాజధానిలో రద్దీగా ఉండే ప్రాంతాలపై టోల్ విధించాలని సిఫార్సు చేసింది.బెంగళూరులో జనసాంద్రత ఎక్కువగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ని తగ్గించడానికి ‘రద్దీ పన్ను’ విధించాలని అధికారులకు ఇటీవలే ఒక నివేదిక సూచించింది.కర్ణాటక దశాబ్దం – 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్ మ్యాప్ అనే శీర్షికతో కర్ణాటక ప్రణాళికా విభాగం, పరిశ్రమ బృందం ఇచ్చిన నివేదిక, రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించే మినహాయింపు లేని వాహనాల నుంచి పన్ను వసూలు చేయడానికి ప్రస్తుత ఫాస్టాగ్ వ్యవస్థను ఆ నివేదిక ఉపయోగించాలని సూచించింది.ప్రజారవాణాను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, జీవన నాణ్యతను పెంచడానికి ఈ ఆదాయాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.సింగపూర్, లండన్, స్టాక్హోమ్ వంటి నగరాలు ట్రాఫిక్ని నిర్వహించడానికి, రద్దీని తగ్గించడానికి ఇలాంటి పన్నులను విజయవంతంగా అమలు చేశాయి.మరి ఈ కంజెషన్ ట్యాక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది అమల్లోకి వస్తే ప్రజలపై మరింత భారం పడినట్టు అవుతుందా? లేక నిజంగానే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందా?

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్