Thursday, October 17, 2024

బాలినేని ఒంటరైపోయారా…

- Advertisement -

బాలినేని ఒంటరైపోయారా…

Balineni is lonely...

ఒంగోలు, అక్టోబరు 17, (వాయిస్ టుడే)
అన్న తోప్‌ దమ్ముంటే ఆపు. బాలినేని అంటే ఓ బ్రాండ్. తాను చేరుతానంటూ ఏ పార్టీ అయినా గంతులేస్తుంది. వైసీపీలో ఉన్నప్పుడు ఆ మాజీమంత్రి చెప్పుకునే తీరు ఇలాగే ఉండేది. సరే వైసీపీకి పవర్‌ పోయింది. సార్‌ ఇక ఫ్యాన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. గ్లాస్‌ పట్టుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా రగిలిపోతున్న రాజకీయాల మధ్యే జరిగింది. సరే వెళ్లాక అంతా సెట్‌ అవుతుందనుకున్నారు. కానీ ఎంట్రీకి ముందున్నదానికంటే.. ఎంట్రీ ఇచ్చాకే అసలు సీన్‌ కనిపిస్తుందట. ఇప్పుడు ఎగ్జిట్‌ అవలేం..అలా అని గ్లాస్‌ పట్టుకుని టీ తాగలేం అన్నట్లుగా మారిపోయిందట ఆయన పరిస్థితి. వెళ్లామా..కండువా కప్పుకున్నామా..పార్టీలో చేరామా అని సోసో అన్నట్లుగా కథ నడిపిస్తున్నారట.మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. విచిత్రపరమైన రాజకీయ పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్‌ వ్యతిరేకించినా జనసేన చీఫ్‌ కండువా కప్పడంతో..ఇక తన హవాకు అడ్డు ఉండదని భావించిన బాలినేనికి ఊహలు గుసగుసలు ఆడుతున్నాయట. జనసేనలో చేరాకే ఆయనకు అసలు సంగతేంటే అర్థం అవుతోందట. వస్తామన్నాం చేర్చుకున్నారు..సఖ్యత లేదు..సయోధ్య లేదు. సొంత నియోజకవర్గంలో ఫ్లెక్సీ మీద తన ఫోటో చూసుకునే పరిస్థితి లేదు. ఏందిదీ అనుకున్నారట. జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌తో ఒంగోలులో సభ పెడతానన్న బాలినేని ఎందుకు సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారో అర్థం కావడం లేదట.ఒంగోలు కూటమి నేతలు వేస్తున్న ఏ ఫ్లెక్సీలో కూడా బాలినేని పేరు, ఫోటో కనిపించడం లేదు. అంతా బాలినేని గడ్డిపోచలా తీసేస్తున్నారు కూటమి నేతలు. దీంతో ఒంగోలు పాలిటిక్స్‌లో మాజీమంత్రి ఒంటరైనట్లు కనిపిస్తోంది. బాలినేని కూడా జనసేనలోకి వెళ్లి హవా నడిపిద్దామనుకుంటే ఇలా అయ్యిందేంట్రా అని అనుచరులతో వాపోతున్నారట. సర్లే ఎలాగూ చేరిపోయాం.. మన మీద అయితే విచారణలు, కేసులు ఉండవు..ఎందుకంటే ఇప్పుడు పవర్‌లో పార్టీలో ఉన్నాం అని అనుచరులతో చెప్పుకుంటూ సంబర పడిపోతున్నారట.మరోవైపు బాలినేనిని మాత్రమే పార్టీలో చేర్చుకున్న జనసేనాని..ఆయన అనుచర వర్గాన్ని మాత్రం లైట్‌ తీసున్నట్లు టాక్. దీంతో లోకల్‌ వైసీపీ క్యాడర్‌, లీడర్లు బాలినేనితో ఉన్నారా లేక.. ఫ్యాన్‌ పార్టీలోనే కొనసాగుతున్నారా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. బాలినేని అనుచరవర్గ కార్పొరేటర్లు ఇంతవరకు వైసీపీకి రాజీనామా చేయలేదు. కానీ జనసేన నేత బాలినేని వెంటనే తిరుగుతూ జై కొడుతున్నారు. బాలినేని ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆయనతో పాటే అటెండ్ అవుతున్నారు. దీంతో బాలినేని వెంట నడుస్తున్న నేతలను కట్టడి చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే పరిస్థితుల్లో గతంలో బాలినేని కేబుల్ వ్యాపారాల్లో అన్ని తానై వ్యవహరించిన పారిశ్రామికవేత్త, జనసేన నేత రవిప్రియ గ్రూప్‌ అధినేత కంది రవిశంకర్ ఎన్నికలకు ముందు నుంచి బాలినేనికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేబుల్ బిజినెస్‌తో పాటు, నాగులప్పులపాడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో బాలినేని వల్ల మోసపోయి తీవ్రంగా నష్టపోయాననే భావనలో కంది రవిశంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు బాలినేని అంటేనే గిట్టడం లేదట. ఈ పరిస్థితులన్నీ గమనించే బాలినేని జనసేనలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది. తాను వైసీపీలోనే కొనసాగితే కోలుకోలేని దెబ్బతింటానన్న భయంతోనే జనసేనలో చేరి సేఫ్ జోన్‌లోకి వెళ్లాడన్న చర్చ జరుగుతోంది. బాలినేనిని ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు..వైసీపీ నేత నెల్లూరు రెడ్డైన ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆయనను జనసేనలోకి పంపించారన్న టాక్ వినపడుతోంది.నెల్లూరు రెడ్లు బాలినేనిని జనసేనలోకి పంపించడంలో వెనక పెద్ద కారణాలే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఒంగోలులోని శ్రీకర విల్లాస్, బల్లికురువ మండలం బొగ్గుల కొండ, కూకట్‌పల్లిలో 8 సంస్థలకు చెందిన మైనింగ్ భూములు, వైజాగ్ దగ్గరలోని దస్పల్లా, అచ్యుతాపురం ఫారెస్ట్ ల్యాండ్, గాజువాక మండలం తుంగ్లం గ్రామంలో ఏపీఐఐసీ భూములు, టంగుటూరు మండలం అనంతవరం గ్రామ భూముల ఆక్రమణ ఆరోపణల నుంచి బయటపడేందకేనన్న చర్చ జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్