Friday, October 18, 2024

బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు..

- Advertisement -

బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు..

No child marriages.. studies are good

కృష్ణకుమారి…
డుంబ్రిగుడ
బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు అని మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం ఆమె పర్యటించి పాఠశాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన ఆమె పరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల జీవితాలు నాశనమవుతున్నాయని ఆమె చెప్పారు. పూర్వికులకు విద్య పట్ల తెలియకపోవడం వల్ల అప్పట్లో చిన్నప్పుడే వయసు నిండకుండానే పూర్వికులు గ్రామ పెద్దలతో పాటు తల్లిదండ్రులు కూడా అప్పట్లో బాల్యవివాహాలు చేసేవారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో నడుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు ప్రస్తుతం తెలుస్తున్నాయని ఆమె చెప్పారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు బాల్య వివాహం చేయడం వల్ల చదువుతున్న విద్యార్థిని చదువుతోపాటు ఆమె సర్వం కోల్పోతుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని బాల్య వివాహం వల్ల అనేక నష్టాలు జరుగుతాయని ఆయా గ్రామాల విద్యార్థినుల తల్లిదండ్రులకు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాన్ని విడిచి విద్యాపై దృష్టి సారించి ఉన్నత విద్యను చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు ఆమె సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్