Friday, October 18, 2024

రామాయణంను ప్రతి ఒక్కరూ చదవాలి

- Advertisement -

రామాయణంను ప్రతి ఒక్కరూ చదవాలి

Everyone should read Ramayana

డోన్
రామాయణ పురాణ గ్రంథ రచయిత వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా డోన్  పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం ఉదయం ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా  తెలుగు ఉపాధ్యాయులు రాధ, భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నేడు విద్యార్థులకు పురాణ గ్రంథాల  నుండి  విలువలు, వాటి విశిష్టతను నేర్పాలన్నారు. అడవిలో కాపుకాసి దారిదోపిడీకి పాల్పడే రత్నాకర్ (వాల్మీకి మొదటి పేరు) నారద మహర్షిని దోచుకొనేందుకు వెంటబడి నప్పుడు, నా దగ్గర వీణ తప్ప ఏమీ లేవని చెపితే, దానిని ఇవ్వు, అమ్ముకుంటానన్నాడు. ఆ డబ్బు తో నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నాడు. అయితే నారదుడు అది పాపం కదా అని తెల్పి, ఈ పాపం నీకే కదాఅని, అందులో ఎవరూ పాలుపంచుకోవాలని తెల్పితే, దానిని నిర్ధారణ చేసుకుని, రామ జపం చేసి, చివరికి రామాయణ గ్రంథాన్ని రచించడానికి పూనుకున్నారు. అదే ఆది కావ్యం గా ప్రసిద్ధి కెక్కినది. అలాగే మహర్షి ఆశ్రమంలో సీతమ్మ తన పిల్లలు లవకుశ లకు జన్మనిచ్చింది. వారికి విద్యాబుద్ధులు నేర్పి, అన్ని విద్యలను నేర్పించింది ఈ వాల్మీకి మహర్షే. ఇలాంటి వారిని స్మరిస్తూ, వారి ఆశయాలను ఆచరణలో పెట్టిన వారందరూ మహనీయులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, వెంకటరమణ, వెంకట లక్ష్మీ,లక్ష్మయ్య, శ్రీనివాసులు, రఘునాథ్, లక్ష్మీ కాంత రెడ్డి, మద్దిలేటి, సుబ్బరాయుడు, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్,సుభాన్, జయసుబ్బారాయుడు, శివన్న, ఆదినారాయణ, సురేష్, సంజీవరెడ్డి, రమేష్, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి, భారతి, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, ముని రాజు,శేషశాయి శర్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్