Tuesday, March 10, 2026

జగన్, షర్మిల  మధ్య రాజీ..

- Advertisement -

జగన్, షర్మిల  మధ్య రాజీ..

Compromise between Jagan and Sharmila..

విజయవాడ. అక్టోబరు 23, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన  మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వస్తూండటమేనని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ పెట్టారు.  కానీ పెద్దగా ఫలితం ఉండదని అంచనాకు రావడంతో వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణంగా నిలిచింది. అన్నా చెల్లెళ్ల మధ్య ఎందుకు దూరం పెరిగిందన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. అటు జగన్ కానీ ఇటు షర్మిల కానీ తమ మధ్య దూరం పెరగడానికి ఫలానా ఇష్యూ కారణం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ పరోక్షంగా షర్మిల చేసిన కామెంట్ల వల్ల వారి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆ లెక్క తేలకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఆస్తిని పంచి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. ఆ కోపంతోనే షర్మిల రాజకీయ ప్రవేశం చేశారన్న ప్రచారమూ ఉంది. అయితే షర్మిల మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నంతగా ఓట్లు సాధించకపోయినా ఇప్పుడు యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ కన్నా ఎక్కువగా ఆమె ఫీల్డ్ లో ఉంటున్నారు.ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఆస్తున్నాయన్నది కొందరి నేతల మాట. సింగపూర్‌తో‌పాటు మరో దేశంలో ఆస్తులున్నట్లు చెప్పుకొచ్చారు. పైకి మాత్రం 2009 ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా లెక్క చెబుతారని అంటున్నారు.అంతర్గతంగా లోటస్ పాండ్ షర్మిలకు వస్తే.. యలహంక జగన్ వెళ్లవచ్చన్నది ఆయా నేతల మాట. మరి విజయమ్మ సంగతేంటన్నది కొందరి ప్రశ్న. భర్త ఆస్తి.. పిల్లలతోపాటు తల్లికీ వాటా వేయాల్సిందేనని అంటున్నారు. ఆ లెక్కన అంతర్గత ఆస్తులు మాత్రం మూడు వాటాలు వేయాల్సిందేనని అంటున్నారు. దీనికి జగన్‌బాబు ఏమంటున్నారు?ఎందుకంటే విజయమ్మ తన కూతురు వద్ద ఉంటున్నారు. ఫ్యామిలీలో అంతర్గత కలహాల ప్రారంభించినప్పటి నుంచి కొడుకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్యలో ఒకసారి కొడుకు వద్దకు తల్లి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఆస్తిలో తల్లికి వాటా ఇస్తే.. చెల్లికి వెళ్లిపోవచ్చన్నది వారి అన్న ఆలోచన. దీనికి ససేమిరా అంటున్నట్లు బెంగుళూరు సమాచారం. తనకు ఎక్కువ వాటా ఇవ్వాల్సిందేనన్నది జగన్ మాటగా చెబుతున్నాయి.2012లో జగన్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 757 కోట్లు రూపాయలున్నట్లు ప్రస్తావించారు. వైఎస్ఆర్ ద్వారా వచ్చిన ఆస్తా? జగన్ రాజకీయాల్లోకి రాకముందు కూడబెట్టిన ఆస్తా? అనేదానిపై స్పష్టత లేదు. అలాగే జగన్ భార్య పేరిట కొన్ని ఆస్తులు, కంపెనీల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం విజయమ్మ పేరిట ఎంత ఆస్తి ఉందన్నది స్పష్టత లేదు. ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎంత  బలపడితే వైసీపీకి అంత మైనస్ అవుతుంది. భవిష్యత్ లో రాబోయే సవాళ్లను తట్టుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి వచ్చే ముప్పును తప్ిపంచుకోవాలని జగన్ అనుకుంటున్నారని అందుకే ఆ  పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో జరిపిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు తెలియచేయలేదు కానీ.. ఇండియా కూడమి సభ్యులంతా వచ్చారు. ఇటీవల ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను జగన్ సమర్థించారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అియతే ఇక్కడ ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల ఆమోదం లేకపోతే ఆ దిశగా అడుగులు పడటం కష్టమేనంటున్నారు. రాజీ చర్చలు జరుగుతున్నా రాజకీయంగా రాజీ పడేందుకు షర్మిల వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే ముందుగా జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని వివరిస్తున్నారు. తర్వాత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన టార్గెట్ ను ఎప్పుడూ మిస్ కానని ఆమె నేరుగా చెబుతున్నట్లవుతోంది. అయితే జగన్ తో ఏ మాత్రం రాజీ పడినట్లుగా  కనిపించినా లేదా రాజీ చర్చలు జరుగుతున్నట్లుగా బయటకు వచ్చినా అది తన రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని షర్మిల అనుకుంటున్నారు. ఆస్తుల గొడవను ఎలా పరిష్కరించుకున్నా లేకపోయినా.. తన రాజకీయం మాత్రం ఆగదనే సంకేతాలను షర్మిల ఇస్తున్నారని అనుకోవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్