- Advertisement -
200 కి పైగా బైకులు రికవరీ
More than 200 bikes recoveredఏలూరు
ఏలూరు జిల్లాలోని ద్విచక్ర వాహనాల రికవరీలో సత్ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా పోలీసులను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు. ఇటీవల కాలంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 200 పైగా వాహనాలను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించామని వెల్లడించారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కైకలూరు రూరల్, ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 17.50 లక్షల విలువ కలిగిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 వాహనాలు, కైకలూరు రూరల్ పరిధిలో 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
మీకు ఎవరి పట్ల అయినా అనుమానం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో వివరాలు అందజేస్తే పోలీసుల అంతర్గత విచారణలో వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.
- Advertisement -




