హత్య కేసులో నిందితుడు అరెస్టు

- Advertisement -

హత్య కేసులో నిందితుడు అరెస్టు

Accused arrested in murder case

తణుకు
తణుకు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సంచలనం రేకెత్తించిన ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేసారు. ఈనెల 1న తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాకర్ల దుర్గారావు (33) జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో హత్యకు గురయ్యాడు. తణుకు పట్టణ  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తణుకు పాతవూరుకు చెందిన కాజ నానాజీను నిందితుడుగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తణుకు పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాద్ వివరాలు వెల్లడించారు. గత నెల 31న రాత్రి 8 గంటల సమయంలో మద్యం తాగేందుకు జడ్పీ పాఠశాల ఆవరణకు వెళ్లిన కాజా నానాజీ. అప్పటికే మద్యం తాగి ఉన్న మృతుడు కాకర్ల దుర్గారావు తనకు మద్యం ఇవ్వాలని దురుసుగా నానాజీను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం. దీంతో దుర్గారావుపై నానాజీ దాడి చేయడంతో తీవ్రగాయాలు అయ్యాయి.  అప్పటికీ నానాజీను దుర్భాషలాడటంతో మరో పెద్ద రాయితో దుర్గారావు తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular