- Advertisement -
కలెక్టరేట్ లో కాటమయ్య కిట్లు పంపిణీ
Distribution of Katamaiya kits in the Collectorate
పాల్గోన్న మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహా, టిజిఐఐసి ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సెట్విన్ ఛైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి బిసిలు, కులవృత్తుల సంక్షేమం పట్ల ఎంతో చిత్తశుద్ధి వున్నదని అన్నారు. గతంలో కల్లుగీత కార్మికులు చెట్లు ఎక్కేటప్పుడు అనేక ప్రమాదాలకు గురయ్యేవారని, దీంతో వారి కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురయ్యేవని మంత్రి పేర్కొన్నారు. కాటమయ్య కిట్లతో గౌడన్నలు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వృత్తులు సంతోషంగా కొనసాగించుకోవచ్చని మంత్రి తెలిపారు. కల్లుగీత కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా సీఎం రేవంత్ రెడ్డిగారు పరిష్కరిస్తారని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. గౌడన్నలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని సహాయ,సహకారాలను అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల అసమానతలను తొలగించడమే లక్ష్యంగా చేపట్టి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్ర సురేఖ పిలుపునిచ్చారు.
- Advertisement -