- Advertisement -
విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం
Not increasing electricity charges is a bold decision
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను అభినందించిన ఐరన్, స్టీల్ అసోసియేషన్
హైదరాబాద్
విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం ఉదయం tisma ప్రతినిధులు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి అభినందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం, 24 గంటల పాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం మూలంగా తమ పరిశ్రమలకు గొప్ప ఊరట లభించింది అని వారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాలని డిప్యూటీ సీఎం tisma ప్రతినిధులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోకి పరిశ్రమలు విస్తరించడం మూలంగా స్థానిక యువతకు ఉపాధి, ఆలయ మార్గాలు లభిస్తాయని .. పరిశ్రమలకు తక్కువ ధరలో వనరులు లభిస్తాయని.. ప్రభుత్వానికి ఆలయం సమకూరుతుందని డిప్యూటీ సీఎం వారికి వివరించారు. సీఎంను కలిసిన వారిలో జాయింట్ ప్రెసిడెంట్ ప్రమోద్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గొయెంక, జాయింట్ సెక్రెటరీ సుధాంశు శేఖర్, కోశాధికారి వినోద్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
- Advertisement -