కూటమి ప్రభుత్వానిది ప్రచారాభ్భాటాలు మాత్రమే

- Advertisement -

కూటమి ప్రభుత్వానిది ప్రచారాభ్భాటాలు మాత్రమే

Kutami government is only propaganda

కాకినాడ
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకపోయినా ఎంతో చేస్తున్నట్లుగా ప్రచారాభ్భాటాలు మాత్రం మితిమీరి చేసుకుంటోందని,ఆరునెలలు కాకుండానే కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్సీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు,పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వంగా గీతావిశ్వనాథ్ అన్నారు.పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వంగా గీతావిశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది.
వాయిస్ ఓవర్:- ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పలువురు ఈ  సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఇందులో భాగంగా పార్టీ నాయకులు గండేపల్లి బాబీ,తలిశెట్టి వేంకటేశ్వరరావు,ముమ్మిడి శ్రీనివాస్  మాట్లాడుతూ.,2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపూ కార్యకర్తలను పార్టీకి చెందిన నాయకులు,ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని,కార్యకర్తలను నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా వారు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వంగా గీతా విశ్వనాథ్,కురసాల కన్నబాబు ప్రసంగించారు.అనంతరం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు కురసాల కన్నబాబును,వంగా గీతను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు,కొత్తెం దత్తుడు,జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు,గొల్లప్రోలు,యూ.కొత్తపల్లి జడ్పీటీసీలు ఉలవకాయల లోవరాజు,గుబ్బల తులసీకుమార్,పిఠాపురం,యూ.కొత్తపల్లి,గొల్లప్రోలు ఎంపీపీలు కన్నాబత్తుల కామేశ్వరరావు,కారే శ్రీను,అరిగెల రామన్నదొర,కొప్పన శివనాథ్,బత్తుల సాయి,రావు చిన్నారావు,వర్ధినీడి సుజాత,జవ్వాది నాయుడు,మొగలి బాబ్జీ,కొత్తపల్లి బుజ్జి,జవ్వాది కృష్ణమాధవరావు,రావూరి వేంకటేశ్వరరావు,జవ్వాది వాడపల్లి,నల్లా రాంబాబు,ముదునూరి కొండబాబురాజు,గండ్రేటి రాము,బోను దేవా,ఉలవల భూషణం,సామరౌతు  లలిత,మఠం లోవరాజు,బొజ్జా పెదకాపు,బొజ్జా మాణిక్యాలరావు,మాదిరెడ్డి దొరబాబు,సయ్యద్ మొహిద్దీన్,ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular