నంద్యాల  మీ సహకారం ఎంతో అవసరం

- Advertisement -

నంద్యాల  మీ సహకారం ఎంతో అవసరం

Nandyala  Your cooperation is essential

 సీఎం చంద్రబాబు ను కోరిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో  గురువారం  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్సువల్ గా (ఆన్ లైన్ )ద్వారా 220 KV విద్యుత్  సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొనగా  ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడ్డ నంద్యాల జిల్లాకు మీ సహాయ,   సహకారం ఎంతో అవసరం అని సీఎం చంద్రబాబు ను కోరారు. నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్న బేతంచెర్ల ప్రాంతంలో నిత్యం విద్యుత్ లోవోల్టేజ్ సమస్య, కరెంటు కోత అధికంగా ఉండడం వల్ల నాపరాతి పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు ఇబ్బంది పడేవారని, 2018-2019 లో మీ చేతుల మీదుగా ఈ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని, గత ఇదేళ్ళ వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కాబడ్డ ఈ సబ్ స్టేషన్ కు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గా అయిన వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసి మీ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యుత్ కష్టాలు తొలగించిన మీకు బేతంచెర్ల ప్రాంతం రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు కు ఎంపీ బైరెడ్డి శబరి చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular