Friday, February 27, 2026

చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు

- Advertisement -

చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు

Tight saree is a risk of skin cancer

             మహిళలకు వైద్యులు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్‌ 7
భారతీయ వస్త్రధారణలో చీరది ప్రత్యేక స్థానం. దేశంలో ఎక్కువ మంది మహిళలు చీరలే కట్టుకుంటారు. అయితే, చీర కట్టుకోవడాన్ని ఇష్టపడే మహిళలకు వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.మహారాష్ట్రలోని వార్ధలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, బీహార్‌లోని మధుబని కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు ఇటీవల ఇద్దరు మహిళలు పార్శ్యంపై నొప్పితో వచ్చారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఇద్దరికీ మార్జోలిన్‌ అల్సర్‌ అనే చర్మ క్యాన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు.వీరిద్దరూ రోజూ చీర కట్టుకుంటారని, చీర లోపల పెట్టికోట్‌ను నడుముకు బిగువుగా కట్టుకోవడం వల్లే చర్మ క్యాన్సర్‌ బారిన పడ్డారని వైద్యులు గుర్తించారు. నడుముకు బిగువుగా చీర లేదా పెట్టికోట్‌ కట్టడం వల్ల తీవ్రమైన ఒత్తిడి కలిగి అల్సర్‌ ఏర్పడుతుందని, ఇది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. మహిళలు పెట్టికోట్‌, చీరను వదులుగా ధరించాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్