- Advertisement -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
Fight against privatization of Visakhapatnam steel
వైకాపా నేత విజయ్ సాయి రెడ్డి
విశాఖపట్నం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్,ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ గా పార్టీ అధి ష్టానం నియమించిన తర్వాత ఆయన విశాఖలో మాజీ మంత్రి , జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నియో జకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణను చంద్రబాబు నాయుడు పూర్తిగా విస్మరించారన్నారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వేల కోట్లకు విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంద న్నారు.అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఉత్తరాంధ్రకు చంద్రబాబు నాయుడు అన్యా యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుం దని, భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 44 పెరుగుతాయన్నారు. మహిళా కోటాతో పాటు రిజర్వేషన్లు పలుచోట్ల మారతాయని వివరించారు.
- Advertisement -