ప్రజా మద్దతు లేక, గెలవలేమనే వైసీపీ నేతలు పోటీ నుంచి తప్పుకున్నారు

- Advertisement -

ప్రజా మద్దతు లేక, గెలవలేమనే వైసీపీ నేతలు పోటీ నుంచి తప్పుకున్నారు

Without public support, YCP leaders withdrew from the contest

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు.
మంగళగిరి
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…  ఓటమిని ముందే ఒప్పుకొని గ్రాడ్యుయేట్ ఎన్నికల నుంచి వైసీపీ నేతలు తప్పుకున్నారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యవాదులను వేధించి, హింసించి, అవమానించడం జరిగింది. ఈ సంఘటనలు మరచిపోలేనివి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గతంలో టీడీపీ నాయకులు తుమ్మినా, దగ్గినా వారిపై కేసులు పెట్టిన చరిత్ర వైసీపీది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్పడం ఓటమిని అంగీకరించినట్లే. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం  ఫరిడవిల్లుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. అదుపులో లేవని వైసీపీ నాయకులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారు.  దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు పోటీ నుంచి విరమించుకున్నారు. శాసనసభ సమావేశాలకు వైసీపీ నాయకులు రాకుండా పారిపోవడం దేనికి సంకేతమో చెప్పాలి.  వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే కావలసిన సౌకర్యాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  రాష్ట్రంలో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం హాస్యాస్పదం. శాంతియుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేదనడం ఒక అభూత కల్పన.  స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఆ వాతావరణం కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడంలేదు, బాయ్ కాట్ చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్పడం వారిలోని భీతి, భయం బయట కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలౌతోందనే విషయం అందరికీ తెలిసిందే.  రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దురాలోచనతో పోటీ నుంచి విరమించుకున్నారు. వైసీపీ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలప్పుడు వైసీపీ నాయకులు అనేక  అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఎంత దారుణంగా ఎన్నికలు జరిగాయో ప్రజలంతా గమనించారు. టీడీపీ నాయకుల నామినేషన్ పత్రాలను చించేశారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అనేక విధాలుగా బెదిరించారు. మాట వినకపోతే పోలీసులతో కార్యకర్తలపై దౌర్జన్యాలు, దమనకాండకు పాల్పడి అనేక చోట్ల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా టెట్ పరీక్షలను నిర్వహించింది. త్వరలో డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. త్వరలో పోలీసు సిబ్బంది నియామకం చేయనున్నాం. ఏపీపీఎస్ సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా కృషి జరుగుతోంది. ఇటీవల నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటించి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు  పారిశ్రామికవేత్తలను ఒప్పించారు. దీంతో లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయి. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగస్థులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి తగ్గించడం జరిగింది. వైసీపీ కుట్రలను మాని, గూడుపుఠానీలకు స్వస్తి పలికి వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీచేయడానికి  ప్రయత్నం చేయాలని జగన్ ను కోరుచున్నామని  ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హితవు పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular