- Advertisement -
పరిశ్రమలకు సంపూర్ణ సహకారం
Total support to industriesవిశాఖపట్నం
అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే… పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్దం చేసినట్లు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో ఉందని అతి కొద్ది రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సీఐఐ 4వ జోనల్ స్థాయి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ప్రధాన అంశాలను సీఐఐ సభ్యులకు వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి జిల్లాలోని అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం చెప్పారని కలెక్టర్ గుర్తు చేశారు. ఆ మేరకు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సహాయంతో అభివృద్ధి పనులకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, అతి త్వరలోనే కార్యాచరణ ప్రారంభమవుతుందని సమావేశంలో భాగంగా కలెక్టర్ వెల్లడించారు. దీనికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని పేర్కొన్నారు.
- Advertisement -




