- Advertisement -
అర్హులందరికి దీపం పథకం
Deepam scheme for all eligibleవిశాఖపట్నం
అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అందించబడునని విశాఖ జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ పేర్కొన్నారు. గ్యాస్ సబ్సిడీపై ప్రజలు ఆందోళన చెందవద్దని , ఈ కేవైసీ చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.జిల్లాలో దీపం పథకం కింద అర్హులకు ఒక ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు పారదర్శకంగా, ఉచితంగా అందించబడునని తెలియజేశారు. ఈ పధకం క్రింద అర్హులను గుర్తించుటకు ఆధార్ నెంబరు తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు వ్యక్తిగత సమాచారం తప్పక కలిగి ఉండాలన్నారు.
- Advertisement -




