ఆత్మవిశ్వాసమే ఆయుదంగా ముందుకు సాగాలి

- Advertisement -

ఆత్మవిశ్వాసమే ఆయుదంగా ముందుకు సాగాలి

Self-confidence should be the weapon to move forward

తాడేపల్లిగూడెం, నవంబర్ 9,

జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగాలని విశాఖపట్నానికి చెందిన ప్రముఖ మానశిక వైద్య నిపుణులు డాక్టర్ బి.రవికాంత్  విద్యార్థులకు సూచించారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ ఆచార్యులు, డాక్టర్ ఎన్.వి.రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ పర్యవేక్షణలో రెండు రోజులపాటు నిర్వహించనున్న మీట్ యువర్ కౌన్సిలర్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో చోటుచేసుకుంటున్న ఎన్నో మార్పులతోపాటు చదువు, పరీక్షల కారణంగా కొంతమంది విద్యార్థులు తీవ్రఒత్తిడి, గందరగోళానికి గురై మానశిక కుంగుబాటుకు గురువుతున్నారని తెలిపారు. ఏ పని చేస్తున్న ఏకాగ్రత లేకపోవటం, కోపం, చికాకు, ఆందోళన వంటి అంతులేని నైరస్యానికి లోనవుతారన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి విద్యార్థి యోగా, వ్యాయామం, పరుగు, నడకకు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. పుస్తకాలు చదవటం, సంగీతం వినడం  ద్వారా మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందని సూచించారు. జీవితంలో ఎదురయ్యే   సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి అవసరమైన మనోధైర్యాన్నిస్తుందని వివరించారు. విద్యార్థుల వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన సమస్యలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular