అసెంబ్లీ  ఫుడ్ కాంట్రాక్టర్  మార్పు

- Advertisement -

అసెంబ్లీ  ఫుడ్ కాంట్రాక్టర్  మార్పు

Assembly  Food  Contractor  Change

అమరావతి
అసెంబ్లీ భోజనంపై  నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.  సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీసారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామని అధికారులు వివరణ ఇచ్చారు.  ఒకేలా భోజనం పెడితే నేనెందుకు నిలదీస్తానన్న సభాపతి అన్నారు.  తనకు  ఫిర్యాదులు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని  అయ్యన్నపాత్రుడు అన్నారు.  పదార్థాలు ఒక్కటే కానీ అన్నం ఒక్కటే మారిందని అధికారులు వివరణ ఇచ్చారు.  అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.   ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేసారు.  ఇవాళ్టి  నుంచే  కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు.  ఇవాళ  అసెంబ్లీ హాలులో  ఎమ్మెల్యేలకు శిక్షణ అనంతరం  మధ్యాహ్నం కొత్త కాంట్రాక్టర్  భోజనం ఏర్పాటు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular