ఇద్దరు దొంగలు అరెస్టు

- Advertisement -

ఇద్దరు దొంగలు అరెస్టు

Two thieves arrested

సామర్లకోట
ఇంటికి తాళాలు వేసిన ఇళ్లె లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర జిల్లాల దొంగలను  కాకినాడ జిల్లా సామర్లకోట పోలీసులు  అరెస్టు చేశారు.ఈసందర్భంగా సామర్లకోట సి.ఐ. కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వేట్లపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో  సాయిబాబు పిర్యాదు మేరకు వారు తెలిపిన వివరాలు ఆధారంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజు ఆదేశాలు మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.ఈ మేరకు కోనసీమ జిల్లాకు చెందిన జిల్లెల రాకేష్  అరెస్టు చేయగా అతని ఇచ్చిన సమాచారం తో  అదే జిల్లా కు చెందిన చావల కృష్ణ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 186.79 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని సి.ఐ. తెలిపారు. ఈమేరకు ముద్దయిలను కోర్టు లో హజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో  క్రైమ్ సిఐ అంకబాబు తదితర పోలీస్ సిబ్బందిని పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular