- Advertisement -
తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పును చేసి పెట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే
BRS party is credited with giving debt of 7 lakh crores to the state of Telangana
ప్రదాని,హోం మంత్రికి పిర్యాదు..సానుకూల స్పందన
బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్
న్యూ డిల్లీ నవంబర్ 14
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా పొల్యూటెడ్ చేసి వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను ఖజానాను దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పును చేసి పెట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీదని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. డిల్లిలో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాం లో తెలంగాణా రాష్ట్రము లో జరిగిన అవినీతి,అక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యాలయం దృష్టికి, హోంమినిస్టర్ అమిత్ షా గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారి నుండి మంచి స్పందన లభించినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు అడ్డంకులు వేస్తూ, స్వాతంత్ర సమరయోధుల యొక్క డిమాండ్లను ఇంప్లిమెంట్ చేయకుండా, స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ గారికి మంజూరు చేసిన పట్టా సర్టిఫికెట్ను ఇంప్లిమెంట్ చేయకుండా, స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో కూడిన పనులకు అడ్డంకులు పడుకుంటూ బిఆర్ఎస్( టిఆర్ఎస్) ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని, అవినీతిని విచ్చలవిడిగా ప్రోత్సహించిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేరుస్తామని, క్షేత్రస్థాయిలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్ర నిర్మాణాన్ని 108 కోట్లతో నిర్మిస్తామని ఇక ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో సంబరాలు జరుపుకుంటారని తెలియజేశారు.పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంటెస్టెడ్ ఎంపీ జి.సాయ గౌడ్, పీపుల్ ఫారం ఆఫ్ ఇండియా ఉమెన్ వింగ్ తెలంగాణ రాష్ట్ర చైర్ పర్సన్ నిర్మల రాణి, భారతదేశ పిరమిడ్ ప్రచారకుడు టి.చిన్న సాయిలు మరియు తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ ధ్యాన ప్రచారకురాలు మహిళా విభాగం అడ్వైజర్ బి.వి.ఎన్ వరలక్ష్మి, పి.ఎస్.ఎస్.యమ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.సంగమేశ్వర్, యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ తదితరులు .
- Advertisement -



