అంబులెన్స్‌ బ్లాస్ట్‌..! తృటిలో ప్రాణాలతో బయటపడ్డ గర్భిణి

- Advertisement -

అంబులెన్స్‌ బ్లాస్ట్‌..! తృటిలో ప్రాణాలతో బయటపడ్డ గర్భిణి

Ambulance blast..! A pregnant woman who narrowly escaped with her life

ముంబై నవంబర్ 14
;మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జల్గావ్‌ జిల్లాలో అంబులెన్స్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిపోయింది. గర్భిణితో పాటు ఆమె కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బుధవారం జరగ్గా.. ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల అద్దాలు సైతం పగిలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. జల్గావ్‌లోని దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్‌లో పేలుడు జరిగింది. ఓ గర్భిణితో పాటు కుటుంబీకులను ఎరండోల్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జల్గావ్‌ జిల్లా హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం గమనించి వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. ఆ తర్వాత వాహనంలో ఉన్న వారందరినీ దింపివేశాడు. ప్రమాదం తర్వాత పలువురు అక్కడికి చేరుకోగా.. దూరంగా ఉండాలంటూ అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. అంబులెన్స్‌లో ఉన్న వారంతా సురక్షితంగా బయటడినట్లుగా పోలీసులు వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular