సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన

CM Revanth Reddy's visit to Vemulawada

ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్
20 వ తేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వేములవాడ పర్యటన ఏర్పాట్లపై  అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు దేవాలయ అభివృద్ధి పై పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  శంఖు స్థాపన చేయనున్నారు. కార్యక్రమాలు ఆధార బాదరా గా కాకుండా శాస్త్రోక్తంగా చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు వేధపడింతులకు సూచించారు.  ముఖ్యమంత్రి వేములవాడ  కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతా చర్యలపై పోలీసులతో చర్చించాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశించారు.
సమావేశంలో దేవాలయ మాస్టర్ ప్లాన్, అభివృద్ధి వేధపాఠశాల  ఆలయ భూసేకరణ పై చర్చించారు. వేములవాడ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి. వేములవాడ నిత్యాన్నదాన సత్రం 10 వేల మంది చేసేలా ప్రణాళిక, నిత్యాన్నదాన సత్రం భవనం  మంజూరు చేసి ముఖ్యమంత్రి చేత ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. వేములవాడ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూమ్స్  నిత్యాన్నదానం అందరికీ అందాలన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular